కలిసిపోవడం అంటే,
విడివిడిగా ఉండలేకపోవడమా?
లేక,
విడదీయలేనంతగా ఏకమైపోవడమా?
విడిపోవడం అంటే,
విడిగా ఉండాలనుకోవడమా?
లేక,
కలిసి ఉండలేకపోవడమా?
"చేద్దాం" అనుకునే ఆలోచన మాటున
దాగి ఉన్న చేదు ప్రశ్నలకి
జవాబివ్వలేని ప్రతీ మనసు....
"అహం"అనబడే తీపి తినిపించి
తిరుగుబాటనే తీర్పునిచ్చుకుంటుంది...
కన్నీళ్ళకి కారణమయ్యే ప్రతీ తప్పుని
కప్పిపుచ్చుకుంటుంది..
తెల్లవారినాకే కొత్త పగలు...
తెల్లవారే దాకా పాత రాత్రే...
ప్రాణాన్ని- "ప్రేమ"ని పాతరేసే రాత్రే...!!
గోడు వినలేని గదిలోని గోడలపై
తలతో తాళం వేస్తూ..
కారే రక్తపు ధారలతో
కల్తీ లేని కథలెన్నో వ్రాస్తూ...
ఎప్పటిలా నేనిలాగే ...
ఎదలోని కుంపటిలా నువ్వలాగే..
-శతఘ్ని..!!
విడివిడిగా ఉండలేకపోవడమా?
లేక,
విడదీయలేనంతగా ఏకమైపోవడమా?
విడిపోవడం అంటే,
విడిగా ఉండాలనుకోవడమా?
లేక,
కలిసి ఉండలేకపోవడమా?
"చేద్దాం" అనుకునే ఆలోచన మాటున
దాగి ఉన్న చేదు ప్రశ్నలకి
జవాబివ్వలేని ప్రతీ మనసు....
"అహం"అనబడే తీపి తినిపించి
తిరుగుబాటనే తీర్పునిచ్చుకుంటుంది...
కన్నీళ్ళకి కారణమయ్యే ప్రతీ తప్పుని
కప్పిపుచ్చుకుంటుంది..
తెల్లవారినాకే కొత్త పగలు...
తెల్లవారే దాకా పాత రాత్రే...
ప్రాణాన్ని- "ప్రేమ"ని పాతరేసే రాత్రే...!!
గోడు వినలేని గదిలోని గోడలపై
తలతో తాళం వేస్తూ..
కారే రక్తపు ధారలతో
కల్తీ లేని కథలెన్నో వ్రాస్తూ...
ఎప్పటిలా నేనిలాగే ...
ఎదలోని కుంపటిలా నువ్వలాగే..
-శతఘ్ని..!!
గోడు వినలేని గదిలోని గోడలపై
ReplyDeleteతలతో తాళం వేస్తూ..
కారే రక్తపు ధారలతో
కల్తీ లేని కథలెన్నో వ్రాస్తూ...
ఎప్పటిలా నేనిలాగే ...
ఎదలోని కుంపటిలా నువ్వలాగే..
Naku nachina vraata
గోడు వినలేని గదిలోని గోడలపై
ReplyDeleteతలతో తాళం వేస్తూ..
కారే రక్తపు ధారలతో
కల్తీ లేని కథలెన్నో వ్రాస్తూ...
ఎప్పటిలా నేనిలాగే ...
ఎదలోని కుంపటిలా నువ్వలాగే..
Naku nachina vraata