ఇది నొప్పి యొక్క భాష..... ఇది ఒక గుండె యొక్క ఘోష "
ఓపికతో చదవండి..........
తన్నననన తన్నననన తందననన తననననన
తనన తనన తనన తనననా.....
తన తననా తననే తననీ తన్నాననీ
తన తననా తననే తననీ తన్నాననీ
తానానే....తానాననీ....తానాననే తానాననా......
---------------------------------------
తన్నన్నాన తన్నెన్నన్ని తానెతన్ననీ
తన్నన్నాన తన్నెన్నన్ని తానెతన్ననీ
తనం తారరీ....తనేతాననీ తానెనానతననా
తనేనాన తన్నన తాననా తన్నెనానా తానే తననా....
ఓ.....ఓ.....ఓ.....ఓ..
పై పాటలు ఎంత బాగున్నాయో కదూ??
హుషారెత్తించే పై పాట... గుండెని మెలిపెట్టే కింది పాట రెండిటికీ రెండే.... సూపర్ హిట్ సాంగ్స్...
ఏంటి...పిచ్చి గాని ఎక్కిందా? తన్నాన్నా... తన్నేన్నా.... అని ఏదేదో అనేసి పాట బాగుందా అని అడుగుతావేంటీ? సూపర్ హిట్ అంటావ్ పైగా? అని అంటారా?
సరే... సరే...కూల్...
పోనీ ఇప్పుడు చూడండి.....
ఇందువదన కుందరదన మందగమన మధురవచన
గగన జగన సొగసులలనవే ...
తొలివలపే తెలిపే చిలిపి సిగ్గేలనే
చెలి చిగురు తొడిగే వగల మొగ్గేలనే
ఐలవ్యూ ఓ హారిక... నీప్రేమకే జోహారిక.....
-----------------------------------------------
కళ్లళ్ళోకి కళ్ళుపెట్టి చూడవెందుకు
చెప్పలేని గుండెకోత పోల్చుకుందుకు...
మనం అన్నది ఒకేమాటని నాకిన్నాళ్ళు తెలుసు
నువ్వు-నేను ఇద్దరున్నామంటే నమ్మనంటూ ఉంది మనసూ....
అర్రే...ఈ పాటలా.... ఎందుకు తెలీదు... సూపర్ హిట్ సాంగ్స్....
ఎప్పుడూ పాడుకుంటూ ఉంటాం.... అని అంటారా??
భేష్... చాలా బాగుంది...!!
ఇంతకీ ఈ ఉపోద్ఘాతం దేనికి ??
పైన వాటికి సంగీతం ఎంత అందించినా ,
అలా తన్ననానా....తన్నన్నా అంటూ
పావుగంట కంటే ఎక్కువ సేపు పాడుకోలేరు....
కింద ఉన్నట్టు,
అక్షరాలు... పదాలు పొదగడం వల్లే
పదికాలాలు పాడుకోగలుగుతున్నాం...
మనకి ఒక పాట నచ్చడం అన్నది
ట్యూన్ కంటే ముఖ్యంగా సాహిత్యం బాగుండటం వల్లనే...
ఆ సాహిత్యంతో మనం ఎక్కడో కనెక్ట్ అవ్వడం వల్లనే
ఒక పాట మనకి నచ్చుతుంది... అలా నచ్చడానికి సంగీతం ఎంతో దోహదపడుతుంది అనేది కాదనలేని సత్యం.
కాబట్టి, అంతలా మనసుని మురిపించే పాటల విషయంలో సంగీతం అందించిన వారిని గుర్తుపెట్టుకుంటారు కానీ,
మీ మనసులని తడిమే ఆ అక్షరాలు రాసిన వారు మాత్రం అక్కర్లేదు.... భేష్....చాలా చాలా బాగుంది...
స్టేజ్ ల మీద పాడే గాయనీ గాయకులు చాలామంది
ఫలానా సినిమాలోని ఫలానా పాట పాడబోతున్నాం
సంగీతం - ఫలానా.... పాడినవారు - ఫలానా అని చెప్తారు కానీ,
రచన - ఫలానా అని చెప్పడమే మానేశారు...
ఇక ఆడియో ఫంక్షన్స్ లో అయితే మరీ దారుణం...
అయ్యా గాయకగాయనీమణులారా - సాటి సంగీత లోకపు జనులారా ( శ్రోతలు )
సంగీతకారులకి ఇచ్చే మర్యాదలో / గుర్తింపులో కనీసం సగమైనా రాసేవారికి ఇవ్వండి.... మనందరికీ తిండిపెట్టే పాట కి - ఆ పాటకి రూపాన్నిచ్చే కవులకి కాస్తైనా విలువ ఇవ్వండి...
తన్నానానాన..... అని సంగీత దర్శకులు ఇచ్చిన మీటర్ కి - దర్శకుడు చెప్పిన సన్నివేశానికి సరిపడే పదాలని కూర్చే క్రమంలో, ఒక కవి ఎంతటి ప్రసవవేదనకి గురవుతాడో సాటి కవిగా నాకు తెలుసు.... "ఫలానా సినిమాలో ఫలానా పాట సూపర్ ఉంది.." అని అంటారు... ఏం నచ్చింది అందులో అని అడిగితే... " ట్యూన్ బాగుంది... సింగర్స్ చించేశారు.... " అని చెప్తారు.... కానీ సాహిత్యం వల్లే నచ్చింది అన్న సంగతి వాళ్ళకీ తెలియదు...కాబట్టి చెప్పలేరు....!!
కాబట్టి, "ఆ....... పాటలు రాసుకునేవాడు......" అని తీసిపారేసినట్టు మాట్లాడకండి...... "
ఈ రాసేవాల్ళే లేకుంటే "స్నానం చేసేటపుడు బాత్రూములో కూనిరాగాలు తీయలేరు....సరికదా, కనీసం మీ పిల్లలకి జోల కూడా పాడుకోలేరు.... అని గుర్తుంచుకోండి....!!
-శతఘ్ని...!!