Saturday, June 11, 2016

నవ్వుకున్నంత సేపే
నువ్వు-నేను లేని "మనం"
కళ్ళు తడవగానే
కదిలి...పోతాం...

దూరమున్నంత సేపే
"మనం" కాని నువ్వు-నేను
మాట కలవగానే
కలిసిపోతాం...

పూర్వ జన్మల 
పుట్టుకల గురించెందుకు మనకు?
ముందు జన్మలకీ ముడిపడ్డావుగా..

కాలమెపుడూ మనని
వేరుచేయలేదు
దూరమెపుడూ మనసులని
భారమనుకోదు...

"పోయే"దాకా
పోనివ్వకపోవడమే ప్రేమ కదా?

-శతఘ్ని..!! 

No comments:

Post a Comment