అప్పట్లో ...ఒక సీరియల్ కోసం... ఒక అమ్మాయి పాడుకునే హుషారు గీతం.....
ఎప్పట్లాగే మొదలవ్వకుండానే ప్రాజెక్టు అటకెక్కడమైనది.... ఎన్నో పాటల్లాగే ఇదీ మరుగున పడినది... అనుకోకుండా కంట పడటంతో...షేరుతున్నా....!!
ఎప్పట్లాగే మొదలవ్వకుండానే ప్రాజెక్టు అటకెక్కడమైనది.... ఎన్నో పాటల్లాగే ఇదీ మరుగున పడినది... అనుకోకుండా కంట పడటంతో...షేరుతున్నా....!!
పాడుతుంటే కోయిలలా
ఆడుతుంటే లేడి పిల్లా
కన్ను కుట్టి ఆగి చూడాలా...
కన్ను కుట్టి ఆగి చూడాలా...
రంగుల / ఈ లోకమిలా
రమ్మ / నంటే ఆగేదెలా
రోజుకొక్క జాతరవ్వాలా...
రమ్మ / నంటే ఆగేదెలా
రోజుకొక్క జాతరవ్వాలా...
కథ చెబుతూ జోలను పాడే ఈ గాలికి
సిరులెన్నో పండించేటి ఈ నేలకి
నేనంటే ప్రాణం పెట్టే ఈ మనుషులకి
ఋణపడిపోనా ప్రతి జన్మకీ....
సిరులెన్నో పండించేటి ఈ నేలకి
నేనంటే ప్రాణం పెట్టే ఈ మనుషులకి
ఋణపడిపోనా ప్రతి జన్మకీ....
కన్నులలో చిలిపి కలా
అల్లుకుని మనసునలా
చూపెనటా మరో ప్రపంచం..
అల్లుకుని మనసునలా
చూపెనటా మరో ప్రపంచం..
చిన్ని చిన్ని ఆశే అలా
తరుముతుంటే నన్నే ఇలా
ఎక్కువయే సిగ్గే ఇంకొంచెం...
తరుముతుంటే నన్నే ఇలా
ఎక్కువయే సిగ్గే ఇంకొంచెం...
తొలివలపే తెలిపిన ఊహల నారాజుకి
నా/ తలపుల లేఖని పంపానీరోజుకి
ప్రేమతో నన్నే గెలిచే ఆ రామునికి
అంకితమౌ ఈ జానకీ.. .....
నా/ తలపుల లేఖని పంపానీరోజుకి
ప్రేమతో నన్నే గెలిచే ఆ రామునికి
అంకితమౌ ఈ జానకీ.. .....
-శతఘ్ని..!!
No comments:
Post a Comment