ఆలోచన 'రాగానే' అక్షరాలు పుడితే,
అవి రంగు వెలిసిన ఇంద్రధనుస్సులే అవుతాయి...
ఆలోచన "రగిలినప్పుడే" అక్షరాలు పుట్టాలి,
అప్పుడే అవి వెలుగులు విరజిమ్మే సూర్యబింబాలు అవుతాయి...
కాగితాలపై సిరాని వృధాగా పారిస్తే
మనసులోపలి భావాలని ఊరకనే పారేస్తే
వచ్చే లాభం ఏమీ లేదు...
'ఏదో రాసేశాం' అనే
అమాయకపు 'సంతృప్తి' తప్ప...!!
నీలోలోపల ఒక యుద్ధం జరగాలి
నీకు నువ్వే ఒక అద్దం అవ్వాలి..
నిన్ను నువ్వు నిజాయితీగా
చూసుకోగలగాలి...
నిన్ను నువ్వు పూర్తిగా
అర్ధం చేసుకోగలగాలి...
నువ్వు కన్న కలని
చూసేందుకు...
పాఠకుడి కళ్ళు ఎదురుచూడాలి..
నీ అక్షరాల వెనుక
ప్రపంచపు ఆలోచనలు పరుగెత్తాలి
వేకువలోనూ నీ కలం వెన్నెలని పంచగలగాలి...
పాఠకుడి స్థాయిని నువ్వు పెంచగలగాలి..
అప్పటి నుండి,
వ్రాస్తూనే ఉండు
నీ అంతరాత్మ నిన్నాపేదాకా
నువ్వు తెలియని ఈ ప్రపంచమంతా
నీ ఆలోచనలతో నిండేదాకా...
రచనాకాలం: 28Nov,2012.
అవి రంగు వెలిసిన ఇంద్రధనుస్సులే అవుతాయి...
ఆలోచన "రగిలినప్పుడే" అక్షరాలు పుట్టాలి,
అప్పుడే అవి వెలుగులు విరజిమ్మే సూర్యబింబాలు అవుతాయి...
కాగితాలపై సిరాని వృధాగా పారిస్తే
మనసులోపలి భావాలని ఊరకనే పారేస్తే
వచ్చే లాభం ఏమీ లేదు...
'ఏదో రాసేశాం' అనే
అమాయకపు 'సంతృప్తి' తప్ప...!!
నీలోలోపల ఒక యుద్ధం జరగాలి
నీకు నువ్వే ఒక అద్దం అవ్వాలి..
నిన్ను నువ్వు నిజాయితీగా
చూసుకోగలగాలి...
నిన్ను నువ్వు పూర్తిగా
అర్ధం చేసుకోగలగాలి...
నువ్వు కన్న కలని
చూసేందుకు...
పాఠకుడి కళ్ళు ఎదురుచూడాలి..
నీ అక్షరాల వెనుక
ప్రపంచపు ఆలోచనలు పరుగెత్తాలి
వేకువలోనూ నీ కలం వెన్నెలని పంచగలగాలి...
పాఠకుడి స్థాయిని నువ్వు పెంచగలగాలి..
అప్పటి నుండి,
వ్రాస్తూనే ఉండు
నీ అంతరాత్మ నిన్నాపేదాకా
నువ్వు తెలియని ఈ ప్రపంచమంతా
నీ ఆలోచనలతో నిండేదాకా...
రచనాకాలం: 28Nov,2012.
ఎంత బాగా చెప్పావో .....,
ReplyDeleteనీ కలమే గనక శతఘ్ని అయి,
ఈ పదాలే శరాలై ఉంటే ఎన్ని గుండెల్ని చీల్చేవో........
ఇప్పుడు అన్ని గుండెల్లోకి చొచ్చుకుపోతున్నాయ్..
నాకు చాలా బాగా నచ్చింది..
*****
నిన్ను నువ్వు మననం చేసుకొని,
నీ' అనే సరిహద్దుల్ని ఖననం చేసుకొని
ఆలోచన రగిలినప్పుడే....
అక్షరాలు రాగలిగినప్పుడే..
నీలోపల యుద్ధంలో నలిగినప్పుడే...
అందులో నీవు మనగలిగినప్పుడే
పుడుతుంది అసలు రాత....
భవితని తిరగరాసే రాత...
-సుష@4U4ever@