జీవితంలో ఏ ఆశయం లేని వాడు
శవంతో సమానం....!!
లెక్క పెడితే,
మన చుట్టూ అలా తిరిగే
శవాలెన్నో...!!
పర నిందలు చేస్తూ..
లేని పౌరుషానికి
పహారా కాస్తూ....
గడిచిన క్షణాల
లెక్కలు వేస్తూ...
దొరికిన అవకాశాన్ని
వృధా చేస్తూ....
పసలేని వాదనలు
చేస్తూ.....
తమకి తెలిసిందే
గొప్పని
తీర్మానించేస్తూ...
కనపడని
భవిష్యత్తులోకి
తదేకంగా చూస్తూ...
చెవిటి సమాజపు చెవికి
తమ ఉపదేశాలు
వినిపిస్తూ...
ఎదుగూ బొదుగూ
లేని ఏకాకుల్లారా...
ఎన్నాళ్లని బ్రతుకుతారలా
ఏ గమ్యం లేకుండా?
పనిచేసుకునే వాళ్ళ మధ్యలో
మీకేం పని
ఇంకా కాటికి పోకుండా?
మీరు కుల్ళిపోయి
ఎన్నాళ్ళయిందో తెలుసుకోండి..!!
రచనాకాలం: 21Nov,2012
hieee vins.....wsh u gudluck for ur blog.....hope it vud b a huge success nd u get a gud applause....!!!!
ReplyDeleteThanks Bhavya...
Deleteall the best dude...
ReplyDelete