పోస్టుకో రకంగా నా మీద అభిప్రాయాలని మార్చుకునే వారు, సున్నిత మనస్కులు (ఆడైనా - మగైనా) ఈ వాక్యం తో ఆగిపొండి. కాదు కూడదు అని ముందుకెళ్లి, తలా తోక లేని ప్రశ్నలు, అర్ధం లేని ఆవేశం ప్రదర్శిస్తూ కామెంట్లు చేస్తే నేను స్పందించను. అదన్నమాట...!!
ఇక విషయానికి వస్తే, మణిరత్నం అనే దర్శకుడు తాజాగా తీసిన ఒక సినిమా "ఓకే బంగారం", కొందరికి " ఓకే వెండి", ఇంకొందరికి "ఓకే రాగి", మరికొందరికి "ఓకే ఇత్తడి".. ఏదో ఒకటి, ఆ సినిమా గురించి ఇప్పటికీ కొందరు తమకి 'అనిపించిన' భావాలను వ్యక్తపరుస్తున్నారు... సంతోషం.. అందులో ఏ మాత్రం తప్పులేదు. కాకపోతే, ఒక దర్శకుడి ప్రతిభని కొలవడానికి అంతకనే ఉత్తమమైన దర్శకులు, ఒక రచయిత పనితనాన్ని పొగడటానికో - తెగడటానికో అంతకంటే ఉత్తమైన రచయితలు...అదే విధంగా సంగీత దర్శకులు- ఛాయాగ్రాహకులు, నటీ నటులు , ఇతర సాంకేతిక నిపుణులు ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఉన్నారు. కానీ, సినిమా పట్ల ప్రేక్షకుడి తాలూకు అభిరుచిని, ప్రేమని, పిచ్చిని కొలవడానికి ఉత్తమ ప్రేక్షకుడు, సినిమా 'చూడటంలో' నిష్ణాతుడు అంటూ ఎవరూ ఉన్నట్టు నాకైతే తెలియదు మరి. బహుశా, అందుకేనేమో సినిమా చూస్ ప్రతీ ప్రేక్షకుడు ఈ మధ్య సినిమా చూడటం తో ఆపేయకుండా, ప్రపంచంలో తానే అత్యుత్తమ ప్రేక్షకుడిగా గుర్తింపు పొందే తాపత్రయంలో సినిమాని చీల్చి చెండాడుతూ 'రివ్యూయర్' అవతారం ఎత్తే ప్రయత్నం చేస్తున్నాడు. (ప్రేక్షకులని తప్పు పట్టడం, తక్కువ చేయడం ఎంతమాత్రం నా అభిమతం కాదు అని చెప్పుకోవడానికి చింతిస్తున్నాను... ఈ మాత్రం కూడా అర్ధం చేసుకోలేని వారు ఇది చదువుతారని తెలిసి).
నల్ల కోటు వేసుకునే లాయరు, ఆసుపత్రిలో కూర్చుని రోగులని చూడటం అంత బాగోదేమో?? సిమెంటు- ఇసుక కలిపి ఇల్లు కట్టే తాపీ మేస్త్రీ వంద అంతస్తుల భవనానికి ప్లాను గీస్తే అస్సలు బాగోదేమో? ఈ క్యాటగిరికి చెందిన వాళ్ళు విషయం అర్ధం చేసుకుని ఇక్కడితో ఆగిపోగలరు.. ముందు చదివితే ఇంకా అస్సలు బాగోదేమో?
ఒక సినిమా చూసిన ప్రేక్షకుడికి, లేదా రివ్యూయర్ కి నిజంగా తన మనసుకి అనిపించింది అనిపించినట్టు వ్రాస్తే ఏ గొడవా లేదు. అలా కాకుండా, తమ so called intelligence ని ప్రపంచం మీదకి అభిప్రాయం, రివ్యూ ల రూపంలో విసిరి కాలర్ ఎగరేసుకుందాం అని , తనకి నిజంగా అనిపించనివి కూడా అనిపించినట్టు , పది మందిలో "వీడు ఎవరూ టచ్ చేయని అంశాలని ప్రస్తావించాడు" అనే ఒక సర్టిఫికేట్ పొందాలనే కోరికతో ఉద్దేశపూర్వకంగా ఆ సినిమా పట్ల తన పైత్యాన్ని, అర్ధం చేసుకోలేనితనాన్ని, అజ్ఞానాన్ని, దర్పాన్ని ప్రదర్శిస్తూ ఇష్టం వచ్చినట్టు వ్రాస్తూ ఉండకపోతే నేను ఇది వ్రాసే వాడిని కాను.
సో..విషయం ఏంటి అంటే... ఒక అమ్మాయి- అబ్బాయి కలిసి ఉందాం అనుకోవడం కేవలం శారీరక వాంఛలు తీర్చుకోవడానికేనా? అర్ధం చేసుకోవడానికి కాకూడదా? ఒకరి పట్ల ఒకరికి ఉన్న అభిప్రాయం సరైనదో కాదో తెలుసుకోవడానికి కాకూడదా? ఇద్దరూ కలిసి జీవితంలో ముందుకి ప్రయాణించడానికి సరైన నిర్ణయం తీసుకోవడానికి కావలసినంత సమయం తీసుకుంటున్నారని అనుకోకూడదా? లేదా, like minded people ఇద్దరు తమకి ఉన్న కొద్ది సమయాన్ని సరదాగా ఒకరితో ఒకరు కలిసి గడపడానికి అనుకోకూడదా? సరదా అంటే సెక్స్ మాత్రమేనా? అదొక్కటే చూపించాడా మణిరత్నం? ఒక ఆడ మగా కలిసేది, కలిసి ఉండాలని అనుకునేది కేవలం కామ వాంఛ తీర్చుకోవడానికేనా? ఇలాగేనా సినిమాని అర్ధం చేసుకోవడం? ఈ లెక్కన..
లాంగ్ లాంగ్ ఎగో... సో లాంగ్ ఎగో ఒక తమిళ కుర్రాడు, ఒక సాంప్రదాయమైన తెలుగు యువతిని ప్రేమించాడు... సారీ కామించాడు. అది అమ్మాయి వాళ్ళ ఇంట్లో పెద్దలకి నచ్చదు. కానీ, పైకి మంచితనం నటిస్తూ ఆ అబ్బాయి ఒక ఏడాది పాటు బయట ఉండి ఆ తరువాత వచ్చాక కూడా ఆ అమ్మాయి పట్ల అంతే ప్రేమ , మళ్లీ సారీ... అంతే కామం ఉంటే పెళ్లి చేస్తాం అని పెద్దలు చెబితే సరే అని ఆ అబ్బాయి అమాయికి దూరంగా వెళ్ళిపోతాడు. తీరా ఆ అబ్బాయి వచ్చే రోజున ఒక దుర్మార్గుడు ఆ అమ్మాయి మానాన్ని దోచుకుంటాడు. ఎర్రగా బుర్రగా ఉండే తాను కామించిన మనిషితోనే కామ వాంఛ తీర్చుకోవాలని అనుకున్న అమ్మాయి తనకి ఇష్టం లేని వ్యక్తి తనని అనుభవించడం, తాను కామించిన మనిషితో మొట్టమొదటి సారి కామ వాంఛ తీర్చుకునే అపురూపమైన అవకాశాన్ని తాను కోల్పోవడం జీర్ణించుకోలేని ఆ అమ్మాయి బాధతో ఆత్మ చేసుకుంటుంది. అది చూసి ఆమెని ప్రాణంగా కామించిన అబ్బాయి, ఆ అమ్మాయితోనే మొదటిసారి కామా వాంఛ తీర్చుకోవాలి అనుకున్న ఆశ ఇక ఎప్పటికీ తీరదు అని నిరాసతో అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు... అని కూడా అర్ధం చేసుకోవచ్చుగా...!!
ఒక బాగా డబ్బున్న తండ్రి పెంపకంలో తనకి ఏమాత్రం ఇష్టం లేనట్టుగా పెరిగిన ఒక అబ్బాయి... తన తండ్రి చూసిన అమ్మాయితో సంబంధం కుదిరాక కూడా తన కళ్ళకి కామ దేవత లా కనిపించిన ఒక అమ్మాయితో తన కామ వాంఛ తీర్చుకోవాలి అనుకుంటాడు. ఆ అమ్మాయి కూడా మనం కామ వాంఛాలు తీర్చుకునే ముందు నాకు నచ్చినట్టు నువ్వు ఉండాలి అంటుంది. అర్ధరాత్రి ఐస్క్రీమ్ కావాలి అంటే, హీరొ మొదటి సారి జీవితంలో తన ఇంటి గోడ దూకి బయటకి వస్తాడు. ఆ ఐస్క్రీమ్ అమ్మే అబ్బాయిని కూడా తన మాటలతో, కామంతో కట్టి పడేసి పేరుతో సహా పిలిచే తన కలుపుగోలుతనానికి ముచ్చటపడ్డ అబ్బాయి, తన తండ్రిని ఒప్పించి... వారం రోజులు తన ఇంట్లోనే ఉండేలా ఏర్పాటు చేస్తాడు. ఈ వారంలో తను మీ అందరికి కచసిహ్తంగా నచ్చుతుంది అని నమ్మకంగా తండ్రికి చెప్తాడు. ఈ వారం రోజుల్లో... అబ్బాయితో ఎలాగైనా తన కామ వాంఛాలు తీర్చుకోవాలి అనే ఏకైక లక్ష్యంతో ఆ అమ్మాయి అబ్బాయి వాలింట్లో అందరినీ తన నడవడికతో ఆకట్టుకుంటుంది. చివరికి, ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడం వల్ల ఆ అమ్మాయి అబ్బాయి ఇంట్లోంచి వెళ్లిపోవాల్సి వస్తుంది. ఆ తరువాత ఆ అబ్బాయి తన తప్పు తెలుసుకుని, ఆ అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్ళి అమ్మాయి వాలింట్లో ఏడు రోజుల పాటు ఉంది, అమ్మాయి వాళ్ళ నాన్నని ఒప్పించి తాను కామించిన అమ్మాయితో తన కామ వాంఛలు తీర్చుకోవాలని డిసైడ్ అయి సక్సెస్ అవుతాడు.... అని కూడా అర్ధం చేసుకోవచ్చుగా...??
అర్ధం చేసుకోవచ్చు ఏమిటి... ఇంతకంటే బాగా అర్ధం చేసుకున్న జనాలు కూడా ఉండే ఉంటారు.... అలా అని వాళ్ళందరికీ సినిమా చూడటం వచ్చు అనా? వాళ్ళకి ఏం అర్ధమైందో, ఎలా అర్ధమైందో చెబితే... సినిమా నిజంగానే అలా ఉన్నట్టా? పోనీ పది మంది బాలేదు అంటే బాలెనట్టు, బాగుంది అంటే, బాగున్నట్టూనా?
వివాహ వ్యవస్థని ఎగతాళి చేశాడు మణిరత్నం :
నిజమా? తోటకూర కట్టేమీ కాదు? నాకిక్కడ ఒక్క ప్రశ్న అడగాలనిపిస్తుంది.. ఏమాత్రం ఒకరితో ఒకరు పెద్దగా పరిచయం లేని ఒక ఆడ మగ
దగ్గర అవ్వడానికి ప్రేరేపించేది శారీరక ఆకర్షణా? ప్రేమనా? పెద్దల పట్ల భయమూ - భక్తి నా?ఇంకేదైనా నా? రోడ్డు మీద పోయే ఒక ముక్కూ మొహం తెలియని వాడు వచ్చి చేయి తగిలిస్తేనే లాగి ఒక్కటిచ్చే భారత స్త్రీ, ఒక ముక్కూ మొహం తెలియని వాడు వంద మంది మధ్యలో, వేద మంత్రాల సాక్షిగా మెడలో తాళి కట్టి , పక్క రోజు పక్కలో భుజం మీద చేయి వేస్తే ఎలా లొంగి పోతోంది? దానికి కారణం నిజంగా ప్రేమ అనుకోగలమా? లేక ఎన్నో ఏళ్ల బట్టి అణుచుకున్న కామ వాంఛలు అనుకోవచ్చా? లేక, పెళ్లి అయ్యేదే సెక్స్ కోసం కదా .."తప్పదు" అనే నిస్సహాయత అనుకోవచ్చా? లేక భార్య అంటే భర్తని "సుఖ పెట్టడం", ఎప్పుడు పిలిస్తే అప్పుడు పక్కన "మూడ్ లేదు", "ఇష్టం లేదు" అనే మాటలు మాట్లాడకుండా పడుకోమని పెద్దలు నూరి పోసిన దాని ఫలితం అనుకోవచ్చా?? అంటే పెళ్లి అనేది శృంగారానికి లైసెన్స్ అనుకోవచ్చా? పెళ్లి అనేది ఆడ- మగ ఎప్పుడు అంటే అప్పుడు తమ వాంఛలు తీర్చుకోవడానికి సహాయపడే వారం అనుకోవచ్చా?
ఇదే విషయం "పెళ్లి అనే సర్టిఫికేట్" ఉంటే ఇదంతా కరెక్ట్ అయిపోతుందా" అని అడిగిన అమ్మాయి తెగించింది అయిపోయిందా? కామంతో తహతహలాడుతున్నది గా కనబడిందా? ఓకే బంగారం సినిమాలో ని హీరో హీరోయిన్ల మధ్య శారీరక వాంఛలె తప్ప మరొకటి లేదు అనుకుంటే, ఇద్దరూ కలిసి కాఫీ తాగడానికి, సినిమాలు చూడటానికి.... షికార్లు చేయడానికి, అమ్మాయి పని మీద మూడు రోజులు ఊరేళ్తున్నా అంటే...ఏదో మిస్ అవుతున్న ఫీల్ వచ్చిన అబ్బాయి చెప్ప పెట్టకుండా తాను కూడా అమ్మాయితో పాటు ఊరు వెళ్ళడానికి ... ఒకే రూములో కలిసి పడుకునే సందర్భం వచ్చినా, సరదాగా పాడుకుని ఆ రాత్రి గడపడానికి ...ఏం మొహమాటం? ఆ రెండు పాత్రల ధ్యేయం కామమే, శారీరక వాంఛలె అయితే ఇద్దరి మొదటి కలయిక దగ్గరి నుండే అదే పనిలో ఉన్నట్టు చూపిస్తే మణిరత్నం ని అడిగేదెవ్వడు? మరి అలా చూపించడానికి మణిరత్నం కి వచ్చిన మొహమాటం ఏమిటి?
ఆ మాత్రం sensibilities లేని దర్శకుడె అయి ఉంటే... తాను తీసుకున్న ప్లాట్ కి విచ్చలవిడిగా ఒక ఇరవై ముప్పై మసాలా బెడ్‌రూమ్ సీన్స్ పెట్టి ఉండేవాడు కదా? live-in relation అంటే అలాగే ఉంటుంది అని చెప్పి తప్పించుకునేవాడు కదా? మధ్యలో గణపతి - భవాని పాత్రలని పెట్టి, కామాన్ని పండించే ఎంతో స్క్రీన్ టైమ్ ని వేస్ట్ చేసుకున్న మణిరత్నాం కి , సినిమా ఎలా తీయాలో ఇరానీ హోటల్ లో ఛాయ్ తాగుతూ లెక్చర్లు ఇద్దాం...
యూత్ కి చెడు సంకేతాలు వెళ్తాయి:
గులాబ్ జాం ఏమీ కాదూ? భగత్ సింగ్, అల్లూరి సీతారామ రాజు, ల గురించి చదివి, వాళ్ళ సినిమాలు చూసి ఎంతమంది అలా తయారవుతున్నారు? సెక్స్ గురించి, ప్రేమ గురించి మాట్లాడితే అటు వైపు మాత్రమే ఆకర్షించ బడుతున్నారు అని లబోదిబోమనడానికి?
చెప్పే విషయాన్ని, చెప్పే పద్ధతిలో చెప్పే మోతాదులో చెబితే ఎవరైనా వింటారు. కేవలం సినిమాలే యువతని చెడగొడుతున్నాయి అని బురద జల్ళకండి... మీ చేతకాని పెంపకాలకి సినిమాని నిందించకండి..
నేను మణిరత్నం కి ఏసీ, ఫ్యాను, టేబుల్ ఫ్యాను, విసనకర్ర అని కాదు.... నాకు 'కనిపించే ' సినిమాని కనిపిస్తున్నట్టే, నిజంగా - నిజాయితీగా చూసి నాకు అంతే నిజంగా - నిజాయితీగా అనిపించింది చెప్పే సగటు సినీ ప్రేమికుడిని అంతే..!! నా జీవితంలో నేను వ్రాసిన అతిపెద్ద వ్యాసం ఇదేనేమో బహుశా... ఇంకా వ్రాయాలి అనిపిస్తోంది కానీ - చిరాగ్గా ఉంది.... స్వస్తి..!!
చివరి మాట: మీ పైత్యాన్ని జనాల మీద రుద్దకండి (మీరు రుద్దారు కదా అనే సొల్లు ప్రశ్న వేసేవాళ్ళు జీవితంలో మీ సోది ప్రొఫైల్ తో నాకు కనిపించకండి.)
-శతఘ్ని..!!
మీ పోస్ట్ చాలా బావుంది.
ReplyDeleteThank you
DeleteThank you
DeleteI haven't see the mentioned movie either review or trailer. But what u said exactly right n it's an eye opener
ReplyDeleteనోటినిండా విషం నింపుకూంటే చాలుగదా!!
ReplyDelete