తూరుపింటి తలుపు తీసి
వెండి మబ్బుల్ని పక్కకి తోసి
మెల్లగా ఒక్కో మెట్టు ఎక్కుతూ
మానవాళి మీదకి ఒక నవ్వుని విసురుతాడు...
"బద్ధకం" నిద్ర లేచి
కళ్ళు నులుముకునే లోపే,
ఒళ్ళు విరుచుకునే లోపే
హాల్లోకొచ్చి పోతాడు...
బాల్కనీలో ఆగి
విటమిన్ "డి" ఇచ్చి పోతాడు...
మనిషికో కిరణాన్నిచ్చి
చీకటి మీదకి యుద్ధానికి వెళ్ళమంటాడు
అది అర్ధం చేసుకోలేని మనిషి
ఆరుబయటే ఆ కిరణాల్ని
ఒక మూలన కట్టేసి...
"వెలుగునదిని" ఈదుకుంటూ
"చీకటి తీరాలకి" చేరుకుంటాడు...
అడగకుండానే
అందిన సహాయం అంటే
మనిషికెప్పుడూ
చిన్నచూపే కదా మరి...
తూరుపు నుండి పడమర వరకు
భానుడిది ప్రయాణం కాదు...
మనిషి జీవితానికి తానిచ్చే
ఒక అవకాశం....
ఆ
అవకాశాన్ని
ఎవరెలా
ఉపయోగించుకుంటారో
అన్నది ఆ అహర్పతికి అక్కర్లేదు..
పడమటి పొదరింటి నుండి
నిదురని మోసుకొచ్చే నిశి వచ్చి
మన కనురెప్పలపై కాపు కాసే లోపు
నిన్నటి తప్పుల్ని నేడు
దిద్దుకున్నామా లేదా
అన్నదే ముఖ్యం.....
వెండి మబ్బుల్ని పక్కకి తోసి
మెల్లగా ఒక్కో మెట్టు ఎక్కుతూ
మానవాళి మీదకి ఒక నవ్వుని విసురుతాడు...
"బద్ధకం" నిద్ర లేచి
కళ్ళు నులుముకునే లోపే,
ఒళ్ళు విరుచుకునే లోపే
హాల్లోకొచ్చి పోతాడు...
బాల్కనీలో ఆగి
విటమిన్ "డి" ఇచ్చి పోతాడు...
మనిషికో కిరణాన్నిచ్చి
చీకటి మీదకి యుద్ధానికి వెళ్ళమంటాడు
అది అర్ధం చేసుకోలేని మనిషి
ఆరుబయటే ఆ కిరణాల్ని
ఒక మూలన కట్టేసి...
"వెలుగునదిని" ఈదుకుంటూ
"చీకటి తీరాలకి" చేరుకుంటాడు...
అడగకుండానే
అందిన సహాయం అంటే
మనిషికెప్పుడూ
చిన్నచూపే కదా మరి...
తూరుపు నుండి పడమర వరకు
భానుడిది ప్రయాణం కాదు...
మనిషి జీవితానికి తానిచ్చే
ఒక అవకాశం....
ఆ
అవకాశాన్ని
ఎవరెలా
ఉపయోగించుకుంటారో
అన్నది ఆ అహర్పతికి అక్కర్లేదు..
పడమటి పొదరింటి నుండి
నిదురని మోసుకొచ్చే నిశి వచ్చి
మన కనురెప్పలపై కాపు కాసే లోపు
నిన్నటి తప్పుల్ని నేడు
దిద్దుకున్నామా లేదా
అన్నదే ముఖ్యం.....
Nice..
ReplyDeletethank you..
Delete